భీమేశ్వరాలయంలో కిక్కిరిసిన భక్తులు

భీమేశ్వరాలయంలో కిక్కిరిసిన భక్తులు

వేములవాడ, వెలుగు :  ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం తెల్లవారుజామున నుంచి దర్శనానికి క్యూ కట్టారు. కార్తీక రెండో సోమవారం కావడంతో భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, లింగార్చనలు ఘనంగా నిర్వహించారు. 

అనంతరం కోడెమొక్కులు చెల్లించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఇన్ చార్జ్ ఈఓ రాజేశ్​, ఏఈఓలు శ్రవణ్​ కుమార్, అశోక్, సూపరిండెంట్లు వెంకటప్రసాద్, నరేందర్, గడ్డం రాజేందర్​తదితరులు పర్యవేక్షించారు.  కాగా.. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు జరుగుతుండడంతో  లఘు దర్శనానికి మాత్రమే భక్తులకు అధికారులు అనుమతి ఇచ్చారు.