పెద్దపల్లి జిల్లాలో గోదావరిలో యువకుడు గల్లంతు

 పెద్దపల్లి జిల్లాలో  గోదావరిలో యువకుడు గల్లంతు

 

  •      పెద్దపల్లి జిల్లాలో ఘటన

మంథని, వెలుగు: గోదావరి నదిలో యువకుడు గల్లంతైన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం..  మంథని టౌన్ లోని మర్రివాడకు చెందిన రావికంటి సాయి(30) సోమవారం గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లి కనిపించలేదు. నది ఒడ్డున అతని సంచి, చెప్పులు, బట్టలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

ఈ విషయం తెలిసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు యువకుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టాలని ఆదేశించారు. మంథని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ అధికారులు వెళ్లి గాలిం పు చేస్తున్నారు. యువకుడి కుటుంబ సభ్యులతో మంత్రి ఫోన్ లో  మాట్లాడి ధైర్యం చెప్పారు.