టికెట్​ ఇవ్వలేదని సెల్​ టవర్​ ఎక్కిన ఆప్​ మాజీ కౌన్సిలర్​

టికెట్​ ఇవ్వలేదని సెల్​ టవర్​ ఎక్కిన ఆప్​ మాజీ కౌన్సిలర్​

ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హాసన్ ఢిల్లీలో ఓ సెల్ టవర్ ఎక్కాడు.శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ కేటాయించలేదని హసీబ్ ఉల్ ఆరోపించాడు. పార్టీకోసం కష్టపడ్డ వారికి టికెట్ నిరాకరిస్తున్నారని ఆరోపించారు.  తూర్పు ఢిల్లీకి చెందిన మాజీ కౌన్సిలర్​ హసీబ్​ కు చెందిన పత్రాలు అతిషి, దుర్గేష్​ పాఠక్​ దగ్గర ఉన్నాయన్నారు. వాటిని తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. తన బ్యాంక్​ పాస్​ బుక్​ తో సహా ఒరిజినల్​ పత్రాలు వారిద్దరి వద్ద ఉన్నాయని చెప్పారు.  

డిసెంబర్ 4న ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. దీని కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 117 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేశారు. పార్టీలో టికెట్ దక్కని మాజీ కౌన్సిలర్లు నిరసన తెలియజేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆప్‌లోకి వచ్చిన ఢిల్లీలోని సీనియర్ కౌన్సిలర్ ముఖేష్ గోయల్.. ఆదర్శ్ నగర్ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. తిమార్‌పూర్‌లోని మల్కాగంజ్‌ నుంచి కాంగ్రెస్‌ మాజీ కౌన్సిలర్‌ గుడ్డిదేవిని అభ్యర్థిగా నిలిపారు.