ఢిల్లీ ఎల్జీతో ఆప్ నేతల భేటీ

ఢిల్లీ ఎల్జీతో ఆప్ నేతల భేటీ

న్యూఢిల్లీ:  నీటి సంక్షోభంపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు ఆదివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. ఒక వారం రోజులైనా నీళ్లు సరిగ్గా రిలీజ్ చేసేలా హర్యానాను ఆదేశించాలని ఎల్జీని కోరినట్లు భేటీ అనంతరం ఆప్ నేతలు మీడియాకు తెలిపారు.

‘‘వారం తర్వాత వర్షాలు పడితే ఢిల్లీకి నీటి కరువు కొంత తీరొచ్చు. అప్పటిదాకా అయినా మా వాటా నీళ్లు మాకు హర్యానా సర్కారు రిలీజ్ చేసేలా చూడాలని ఎల్జీని కోరినం. దీనిపై హర్యానాతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు” అని నేతలు మీడియాకు తెలిపారు.