40 మంది ఆప్ ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ కుట్ర

40 మంది ఆప్ ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ కుట్ర

ఢిల్లీ రాజకీయాల్లో కలకలం రేగింది. కేజ్రీవాల్ మీటింగ్ కు కొందరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారన్న సమాచారంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. లిక్కర్ స్కాం ఆరోపణలు వస్తున్న టైంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో  ఇవాళ ప్రత్యేక సమావేశానికి కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. అయితే ఈ భేటీకి  కొంత మంది ఎమ్మెల్యేలు రాలేదన్న సమాచారం హాట్ టాపిక్ గా మారింది.

మరో వైపు సొంతపార్టీలోనే తిరుగుబాటు తీసుకువచ్చే  కుట్ర జరుగుతోందని  ఆప్ నేతలు ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఆరోపణలు చేసింది. సీబీఐ, ఈడీ ద్వారా... కేజ్రీవాల్ సర్కార్ ను అస్థిరపరిచేందుకు  జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని  ఆ పార్టీ నేతలు అంటున్నారు.  40 మంది ఎమ్మెల్యేలను బీజేపీ తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే ఆరోపణలతో ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా మారింది.