కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్

కేజ్రీవాల్ను  చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్


ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరో పించారు. ఆయన ఆరోగ్యానికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేమని వైద్య పరీక్ష నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటుచేసిన సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ 'కేజీవాల్ ప్రాణాల తో బీజేపీ చెలగాటమాడుతోంది. 

మొదట్లో స్వీట్లు తింటూ షుగర్ లెవల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయనపై ఆరోప ణలు చేశారు. ఇప్పుడు ఫుడ్ తగ్గించారని అంటున్నారు. ఎవరైనా అలా చేసి తమ ప్రాణాలపైకి తామే ఎందుకు తెచ్చుకుం టారు? ఆయన్ని చంపేందుకు కుట్ర జరు గుతోంది' అంటూ సంజయ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు.