రాజ్యసభ సీట్లపై దృష్టి పెట్టిన పంజాబ్ సర్కార్

రాజ్యసభ సీట్లపై దృష్టి పెట్టిన పంజాబ్ సర్కార్

పంజాబ్ లో అనూహ్య విజయం సాధించిన ఆప్.. రోజుకో నిర్ణయంతో వార్తల్లో నిలుస్తోంది. రెండు రోజుల క్రితం కేబినెట్ మంత్రులు ప్రమాణం చేసిన వెంటనే.. 25 వేల జాబులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా.. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేట్ చేసింది. హర్భజన్ సింగ్‌తో పాటు, ఢిల్లీ జల్ బోర్డ్ వైస్ ఛైర్మన్ రాఘవ్ చద్దా, ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పాఠక్‌లను కూడా రాజ్యసభకు నామినేట్ చేసింది. పంజాబ్‌లోని ఐదు రాజ్యసభ స్థానాలు వచ్చే నెలలో ఖాళీ అవుతాయి. ఆ ఖాళీలకు నామినేషన్ దాఖలు చేయడానికి ఈరోజే చివరి రోజు కావడంతో వీరి పేర్లను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఇటీవలే రిటైర్‎మెంట్ ప్రకటించిన హర్భజన్.. 18 ఏళ్ల పాటు క్రికెట్‎లో కొనసాగారు. ఆయన తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 700 వికెట్లు తీశారు. కాగా.. భజ్జీ తన రిటైర్మెంట్ ప్రకటించే ముందు కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూని కలిశారు. దాంతో భజ్జీ కాంగ్రెస్‌లో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని భజ్జీ స్పష్టం చేశారు. 

ఆప్ పంజాబ్‌లోని 117 అసెంబ్లీ నియోజకవర్గాలలో 92 స్థానాలు గెలుచుకుంది. ఐదు రాజ్యసభ స్థానాలు వచ్చే నెలలో ఖాళీ అవుతుండటంతో.. మార్చి 31న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో ఆప్ బలం 3 నుంచి 8కి పెరుగుతుంది.

For More News..

ఫైనాన్షియల్​ ఇయర్​ ఎండ్.. ఈ పనులు తప్పక చేయాలె

వయసు మీద పడిందని కలలు కనడం మానొద్దు