ఫైనాన్షియల్​ ఇయర్​ ఎండ్.. ఈ పనులు తప్పక చేయాలె

ఫైనాన్షియల్​ ఇయర్​ ఎండ్.. ఈ పనులు తప్పక చేయాలె

న్యూఢిల్లీ: ఈ నెలాఖరుతో  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–-22) ముగుస్తుంది కాబట్టి ఆర్థిక విషయాలకు సంబంధించిన  గడువులూ ముగుస్తాయి. ఆదాయపు పన్ను చెల్లింపుదారులతోపాటు ఇతరులూ పాన్-–ఆధార్ లింకింగ్‌‌‌‌‌‌‌‌‌‌ను చెక్​ చేసుకోవాలి. లేకపోతే ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్​) ఫైల్ చేయడం వంటివి సాధ్యం కాదు. ఇందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఈలోపు చేయాల్సిన మరికొన్ని పనుల వివరాలు.

1. రివైజ్డ్ ఐటీఆర్​ ఫైలింగ్:  2021–-22 ఫైనాన్షియల్​ ఇయర్​ కోసం రివైజ్డ్​ ఐటీఆర్​ ఫైలింగ్‌‌‌‌కు 31 మార్చి 2022 గడువు ఉంది.  ఇప్పటికీ ఐటీఆర్​ ఫైల్ చేయకుంటే వెంటనే చేయాలి.  ​2020–-21  ఫైనాన్షియల్​ ఇయర్ కోసం రివైజ్డ్​ ఐటీఆర్​ని ఫైల్ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2021.  సంబంధిత వ్యక్తులు రివైజ్డ్​ ఐటీఆర్​ని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఫైల్ చేసినట్లయితే,  దానిని 31 మార్చి 2022లోపు మార్చవచ్చు. ఈ–-ఫైల్ చేసిన ఐటీఆర్​లో ఏదైనా పొరపాటును గమనించినట్లయితే  సరిచేసుకోవచ్చు. 
2. పాన్–-ఆధార్ లింకింగ్: ఆధార్ కార్డ్‌‌‌‌తో  పాన్‌‌‌‌ కార్డును సీడింగ్ చేయడానికి 31 మార్చి 2022 చివరి తేదీ. ఈ గడువులోపు లింకింగ్​ కాకపోతే పాన్ కార్డ్ పనిచేయదు.  చెల్లని పాన్​ కార్డు హోల్డర్లకు సెక్షన్ 272బీ ప్రకారం రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు.  బ్యాంకు డిపాజిట్ వడ్డీపై  పొందేవాళ్లకు అయితే టీడీఎస్​ రెట్టింపు అవుతుంది.
3. బ్యాంక్ ఖాతాలకు కేవైసీ అప్‌‌‌‌డేట్: 2021 సంవత్సరం చివరిలో  ఒమిక్రాన్ రావడంతో బ్యాంక్ ఖాతాల యూవర్​ కస్టమర్​(కేవైసీ) అప్‌‌‌‌డేట్ కోసం గడువును ఆర్​బీఐ 31 డిసెంబర్ 2021 నుండి 31 మార్చి 2022 వరకు పొడిగించాల్సి వచ్చింది.  బ్యాంక్ ఖాతాదారులు తమ కేవైసీ అప్‌‌‌‌డేట్‌‌‌‌ను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలి. లేకుంటే వారి బ్యాంక్ ఖాతా పనిచేయదు. 
4. పన్ను ఆదా పెట్టుబడి పథకాలు: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్​), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్​పీఎస్​), ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్ ఫండ్‌‌‌‌లు వంటి ట్యాక్స్​ సేవింగ్స్​ స్కీముల ద్వారా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.  ట్యాక్స్​ పేయర్లు ఇలాంటి పెట్టుబడులను పరిశీలించుకొని  వీలైతే ఇలాంటి స్కీముల్లో పొదుపును పెంచుకోవాలి. పన్ను ఆదా చేసే పెట్టుబడికి ఇంకా అవకాశం ఉన్న వాళ్లు ఈ నెలాఖరులోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.