హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క సీటు గెలవలేకపోయిన ఆప్

హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క సీటు గెలవలేకపోయిన ఆప్

హిమాచల్ ప్రదేశ్‌లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం పోలింగ్ లో ఆ పార్టీ 1.10 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. డల్హౌసీ, కసుంప్టి, చోపాల్, అర్కి, చంబా, చురా వంటి నియోజకవర్గాల్లోనూ ఆప్ కంటే ఎక్కువ మంది ఓటర్లు  నోటాకే ఓటు వేశారు. మొత్తం పోలింగ్ లో నోటా షేర్ 0.60గా ఉంది. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఆప్ 67 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్రంలో పెద్దగా పేరున్న నాయకులెవరూ లేకపోవడంతో ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. 

కాంగ్రెస్ సూపర్ విక్టరీ 

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సూపర్ విక్టరీ కొట్టింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 40 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. అధికార బీజేపీ 25 స్థానాల దగ్గరే ఆగిపోయింది. ఇండిపెండెంట్లు మాత్రం నాలుగు స్థానాల్లో గెలిచారు. బీజేపీ ఓటమిని అంగీకరించిన సీఎం  జైరామ్ ఠాగూర్ గవర్నర్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు. 

సంప్రదాయాన్నే ఫాలో అయ్యారు 

వాస్తవానికి హిమాచల్ ప్రజలు సంప్రదాయాన్నే ఫాలో అయ్యారని చెప్పొచ్చు. పవర్ గేమ్ లో ఐదేళ్లకో పార్టీని మార్చడం అక్కడి ఓటర్లకు అలవాటే. 1985 నుంచే ఆల్టర్ నేటివ్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. 2017లో బీజేపీని గెలిపిస్తే ఇప్పుడు కాంగ్రెస్ కు హిమాచల్ ప్రజలు పట్టం కట్టారు.