ఢిల్లీ మినిస్టర్​ రాజేంద్ర పాల్ రాజీనామా

ఢిల్లీ మినిస్టర్​ రాజేంద్ర పాల్ రాజీనామా

న్యూఢిల్లీ: మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రెండ్రోజుల కింద జరిగిన కార్యక్రమంలో మంత్రి గౌతమ్ పాల్గొన్నారు. అందులో వందలాది మంది బౌద్ధాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా హిందూ దేవుళ్లను ఇకపై దేవతలుగా పరిగణించబోమని వాళ్లంతా ప్రతిజ్ఞ చేస్తున్న వీడియో వైరల్ అయింది.

ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొనడంపై బీజేపీ వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​కు కూడా నిరసన సెగ తగిలింది. ఈ క్రమంలోనే సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ రాజీనామా చేశారు.