Aaradhya Devi: అసాధ్యుడివి వర్మ..చీరలో ముద్దుగా ఉండేది..రొమాంటిక్కు అంబాసిడర్లా మార్చేశావు

Aaradhya Devi: అసాధ్యుడివి వర్మ..చీరలో ముద్దుగా ఉండేది..రొమాంటిక్కు అంబాసిడర్లా మార్చేశావు

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌(Ram Gopal Varma) గతేడాది తన ఇంస్టాగ్రామ్ లో చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి(శ్రీలక్ష్మీ సతీష్)..కానీ స్క్రీన్ నేమ్ ఆరాధ్య దేవి(Aaradya Devi)గా అందరికి పరిచయం. ఆరాధ్య వీడియోలను ఆర్జీవి షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ  అమ్మాయి ఎవరో తెలుసా అంటూ నెటిజన్స్ ను కూడా ప్రశ్నించాడు.

ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఆ అమ్మాయి ఓవర్ నైట్ ఫేమస్ అయిపొయింది. ఈ అమ్మాయితో శారీ అనే టైటిల్ పెట్టి సినిమా కూడా స్టార్ట్ చేశాడు అప్పట్లో ఆర్జీవీ బాస్. అలా శారీ'(చీర) గర్ల్ గా మస్త్ కుర్రాళ్ళ గుండెల్లో అలా ఉండిపోయింది. ఇపుడు ఇదంతా మళ్లీ ఎందుకంటే.. 

లేటెస్ట్ గా వర్మ ఆమె ఫోటోలను షేర్ చేస్తూ..ఇవి కేరళకు చెందిన ఆరాధ్యా దేవి అనే అమ్మాయి ఫోటోలు, Rgv డెన్‌లోని బృందం ఒక ఇన్‌స్టా రీల్‌లో కనుగొని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తమ చిత్రం శారీ కోసం సంతకం చేసింది. ఫోటోగ్రాఫర్ యశ్వంత్ చేసిన ఫోటో షూట్ ఇది. చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ” అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక ఈ ఫొటోల్లో ఉన్న శారీ గర్ల్ ఆరాధ్యగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పోజింగ్ తో అదరగొట్టింది. బ్లాక్ కలర్ టాప్..జీన్స్ షార్ట్ తో కొన్ని..వైట్ టాప్ లో  అందాలను ఆరబోస్తూ ఉన్న ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆర్జీవీ కన్ను పడిన గర్ల్..ఇలా కాకపోతే ఎలా అవుతుందని..చీరలో ముద్దుగా బొద్దుగా ఉండేది..ఇప్పుడేమో ఇలా రొమాంటిక్ యాంగిల్ కు అంబాసిడర్ లా మార్చేశావ్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.