
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా అంజి కే మణిపుత్ర రూపొందించిన చిత్రం ‘ఆయ్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ‘మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాకు మౌత్ టాక్ బాగుంటే.. సినిమా ఏ రేంజ్ వరకు వెళ్తుందో, ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ‘ఆయ్’ నిరూపించింది.
110 స్క్రీన్‌లతో మొదలైన ఈ సినిమా 382 స్క్రీన్‌లకు వెళ్లింది. యూఎస్‌లో 27 స్క్రీన్లతో మొదలై 86 వరకు వెళ్లింది. ఇప్పటి వరకు11 కోట్ల గ్రాస్‌కి పైగా కలెక్ట్ చేసింది’ అని చెప్పారు. చిన్న చిత్రమే అయినా పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్ అని చెప్పారు హీరో నార్నే నితిన్, దర్శకుడు అంజి. నిర్మాత ఎస్‌కేఎన్, నటులు అంకిత్ కొయ్య, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, కెమెరామెన్ సమీర్ పాల్గొన్నారు.