ఢిల్లీ లిక్కర్ కేసు.. అభిషేక్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ కేసు.. అభిషేక్ కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ పై స్టే ఇవ్వడానికి  ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. విజయ్ నాయర్, అభిషేక్ రావుని ఢిల్లీ సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు . దీంతో అభిషేక్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జైల్లో బుక్స్ , మెడిసిన్ ,ఉలెన్ బట్టలు, కేటిల్ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను  సీబీఐ స్పెషల్ కోర్ట్ ఆదేశించింది .

విజయ్ నాయర్ ని మరో వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు అడిగారు. విజయ్ నాయర్ లాప్ టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామన్నారు. డేటా రికవరీ జరుగుతుందని.. లాప్ టాప్ లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్, ఆధారాలు ఉన్నాయని చెప్పారు. లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ లాప్ టాప్ రిపోర్ట్ చాలా కీలకమని తెలిపారు. 100 కోట్ల రూపాయిలు చేతులు మారాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ల్యాప్ టాప్ రిపోర్టు రేపు రానుందని  ఈడీ తరపు న్యాయవాదులు చెప్పారు.

డేటా అనాలసిస్  పేరుతో తన క్లయింట్ ను ఇబ్బంది పెడుతున్నారని విజయ్ నాయర్ తరపు న్యాయవాది వాదించారు. ఈడీ విచారణకు విజయ్ నాయర్ సహకరిస్తున్నారని..  ఫోన్ పాస్ వర్డ్.. ల్యాప్ టాప్ పాస్ వర్డ్, ఇ-మెయిల్ పాస్ వర్డ్ అన్నీ  ఈడి అధికారులకు చెప్పారన్నారు.   కస్టడీలో రెండు మూడు రోజులు ఈడీ అసలు ప్రశ్నించలేదని.. ఇంకా కస్టడీ దేనికని వాదనలు వినిపించారు

ఇక శరత్ చంద్రారెడ్డికి బుక్స్, ఇంటి ఫుడ్ ఇవ్వాలని  ఆయన  తరపు న్యాయవాదులు సీబీఐ న్యాయస్థానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పుస్తకాలను మాత్రమే ఇచ్చేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటి భోజనం కుదరదని తేల్చి చెప్పిన న్యాయస్థానం...ఒక వేళ డాక్టర్లు సూచిస్తే మాత్రం ఆ భోజనం కూడా జైలు కిచన్ లో తయారుచేసి అందించాలని ఆదేశాలు ఇచ్చింది.