షూటింగ్ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్ గెలిచిన అభిషేక్ వర్మ

షూటింగ్ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్ గెలిచిన అభిషేక్ వర్మ

బీజింగ్‌ : షూటింగ్‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో ఇండియా షూటర్లకు ఎదురేలేకుండా పోయింది . ఒకరిని మించిమరొకరు అన్నట్టు మన ఆటగాళ్లు పతకాలనుగురి చూసి కొడుతున్నారు . మెగా టోర్నీలో ఇప్పటికే రెండు స్వర్ణాలు, రజతం నెగ్గిన ఇండియా ఖాతాలో మరో పసిడి చేరింది . 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ లో ఆరంభం నుంచి ముగింపు వరకు అదిరిపోయే పెర్ఫామెన్స్‌ తో అభిషేక్‌ వర్మ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌గెలిచాడు. దాంతో పాటు ఇండియా నుంచి ఐదోఒలింపి క్‌ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. లాయర్‌ నుంచి షూటర్‌ గా మారిన అభిషేక్‌ శనివారం జరిగిన ఫైనల్లో 242.7 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌ లో నిలిచాడు. రష్యాకు చెందిన అర్టెమ్‌ చెర్నౌ సొవ్‌ 240.4 పాయింట్లతో సిల్వర్‌ మెడల్‌నెగ్గగా, కొరియా షూటర్‌ సెయుంగ్వు హన్‌ 220పాయింట్లతో కాంస్యం గెలిచాడు. జడ్జీ కుమారుడైన అభిషేక్‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ లో ఫైనల్‌ చేరిన తొలిసారే స్వర్ణం కైవసం చేసుకోవడం విశేషం.

ఈ ఏడాదిఢిల్లీలో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌ అరంగేట్రం చేసిన వర్మ.. అప్పుడుఫైనల్‌ కు క్వాలి ఫై కాలేకపోయాడు. అయితే, ఈమెగా టోర్నీలో ఎలాగైనా పతకం నెగ్గాలన్న కసితో బరిలోకి దిగిన అభిషేక్‌ .. క్వాలిఫికేషన్‌ రౌండ్‌ లో585 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిఫైనల్‌ కు అర్హత సాధించాడు. ఇదే ఈవెంట్‌ లో పటీపడ్డ ఇండియా షూటర్లు షహజార్‌ రజ్వి , అర్జున్‌సింగ్‌ 32, 54 స్థానా లతో అర్హత రౌండ్‌ లోనే వైదొలిగారు. అంతర్జాతీయ స్థాయిలో అంతగాఅనుభవం లేని అభిషేక్‌ మాత్రం అంచనాలను అందు కున్నాడు. ఏషియన్‌ గేమ్స్‌ లో కాంస్యం గెలిచి పేరు తెచ్చుకున్న అతను.. ఒలింపిక్‌ , వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్లను ఓడిస్తూ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలవడం విశేషం.కాగా, మహిళల 25 మీ. పిస్టల్‌ క్వాలి ఫికేషన్‌రౌండ్‌ లో మను భాకర్‌ 291 పాయింట్లతో 14వస్థానం, రాహి సర్నోబత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 288 పాయిం ట్లతో 29వస్థా నంతో ఫైనల్‌ కు క్వాలి ఫై కాలేకపోయారు.పోటీల చివరి రోజైన ఆదివారం మహిళల 50 మీ.రైఫిల్‌ 3 పొజిషన్స్‌ లో ఇండియా అమ్మాయిలుఅదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు