తమిళ బ్లాక్‌బస్టర్ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘విత్ లవ్’. రీసెంట్‌గా వచ్చిన ‘చాంపియన్’ మూవీలో తనదైన నటనతో ఆకట్టుకున్న అనస్వర రాజన్ ఇందులో హీరోయిన్‌గా నటించింది.
ఈ తమిళ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించగా, రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్‌తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ కలిసి నిర్మించారు. ఫిబ్రవరి 6న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
ఆదివారం ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను తెలుగు వెర్షన్‌లో విడుదల చేశారు మేకర్స్. ‘అయ్యో కాదలే.. పుట్టేసిందిలే నోలో పిల్లా నీ వల్లే.. గుచ్చే చూపులే బాణం వేసేలే పిల్లో నీ వాలు కళ్లే..’ అంటూ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన లవ్ సాంగ్ ఆకట్టుకుంది.
ఇందులో అభిషన్, అనస్వర స్టూడెంట్స్ గెటప్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. సీన్ రోల్డాన్ కంపోజ్ చేసిన పాటకు సినారే క్యాచీ లిరిక్స్ అందించారు. విజయ్ నరైన పాడిన ఆకట్టుకుంది.
