మానస సరోవరంలో చిక్కుకున్న 40 మంది యాత్రికులు

మానస సరోవరంలో చిక్కుకున్న 40 మంది యాత్రికులు

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది యాత్రికులు మానస సరోవరంలో చిక్కుకున్నారు. చైనా- నేపాల్‌ సరిహద్దుల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన రెండు రాష్ట్రాల నుంచి యాత్రికులు మానస సరోవర యాత్రకు బయల్దేరారు. వారు గత ఐదు రోజులుగా అక్కడ ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. తాము ఇబ్బంది పడుతున్న విషయాన్ని వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించారు. తమను రక్షించాలంటూ వీడియోలో కోరారు. కొంత మంది అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. యాత్రికుల అవస్థలను వారిని తీసుకెళ్లిన  ట్రావెల్స్‌ సంస్థ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.