
మెగాస్టార్ మమ్ముట్టి (Mammotty) బేసిగ్గా మలయాళీ యాక్టర్.ఆయన నుంచి తెలుగులో వచ్చిన దళపతి,స్వాతి కిరణం,యాత్ర లాంటి మూవీస్తో టాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఈ మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నుంచి వచ్ఘే సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఆయన రీసెంట్ హిట్ చిత్రాలు కన్నూర్ స్క్వాడ్, కాదల్ ది కోర్ తర్వాత అబ్రహం ఓజ్లర్ మూవీ థియేటర్లలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.
గతేడాది డిసెంబర్ 25న రిలీజైన అబ్రహం ఓజ్లర్(Abraham Ozler) మూవీ ఇవాళ (ఫిబ్రవరి 9న) ఓటీటీలోకి వచ్చేసింది.ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా కథాంశంతో తెరకెక్కిన అబ్రహం ఓజ్లర్ లో సీనియర్ యాక్టర్ జయరాం(Jayaram) హీరోగా నటించాడు.
ఈ సినిమాలో మమ్ముట్టి సీరియల్ కిల్లర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కనిపించాడు. దాదాపు రూ.5కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్..బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ థియేటర్ ఆడియాన్స్ కు బాగా నచ్చేసింది. మరి ఓటీటీలో ఆడియన్స్ కు..క్రైమ్ జోనర్ను ఇష్టపడే వారికి ఎలాంటి థ్రిల్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో అబ్రహం ఓజ్లర్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా హీరో జయరాం నటనకు ప్రశంసలు అందుకున్నారు.