T-10 లీగ్: సిక్సర్లతో క్రిస్ గేల్ సునామీ

T-10 లీగ్: సిక్సర్లతో క్రిస్ గేల్ సునామీ

అబుదాబిలో జరుగుతున్న T-10 లీగ్‌లో వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్ గ్రిస్‌ గేల్ చెలరేగిపోయాడు. 22 బంతుల్లో 84 పరుగులు చేశాడు. గ్రౌండ్ నలుమూలల తనదైన శైలిలో షాట్స్ ఆడుతూ ప్రేక్షకులను అలరించాడు. అబుదాబి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ …చెలరేగి 6 ఫోర్లు, 9 సిక్సులతో ప్రత్యర్ధి జట్టు మరాఠా అరేబియన్స్‌ కు చుక్కలు చూపించాడు. కేవలం 12 బాల్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో అబుదాబి జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

గతంలో ఇదే రికార్డు మహ్మద్ షేజాద్ పేరిట ఉండగా, 12 బంతుల్లో 50 రన్స్ చేసి ఆ రికార్డును గేల్ సమం చేశాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 97 పరుగులు చేసింది.