ఇంటర్ బోర్డ్ దగ్గర ఉద్రిక్తత.. ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్

ఇంటర్ బోర్డ్ దగ్గర ఉద్రిక్తత.. ఏబీవీపీ విద్యార్థుల అరెస్ట్

హైదరాబద్ ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అధిక ఫీజులు తీసుకుంటున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డును   ముట్టడించింది ఏబీవీపీ. గుర్తింపు లేకుండా నడుస్తున్న ఇంటర్ జూనియర్ కాలేజీల రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ విద్యార్థులు.  ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఇంటర్ బోర్డు ముందు  విద్యార్థులు ఆందోళకు దిగారు.  దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య  తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో  ఇంటర్ బోర్డు లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు విద్యార్థులను  పోలీసులు అడ్డుకుని  అరెస్ట్  చేశారు.