అకడమికల్లీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సెంటర్ షురూ

అకడమికల్లీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సెంటర్ షురూ

హైదరాబాద్, వెలుగు: హెల్త్​కేర్​ ఎడ్‌‌‌‌‌‌‌‌టెక్ అకడమికల్లీ గ్లోబల్ సంస్థ డాకర్లు, డెంటిస్టులు, ఫార్మసిస్ట్‌‌‌‌‌‌‌‌లు, ఫిజియోథెరపిస్టులు, నర్సుల వంటి వైద్య నిపుణులకు  విదేశాల్లో అవకాశాలను అందించడంలో సహాయపడటానికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తన మొదటి ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సెంటర్‌‌‌‌‌‌‌‌ను సోమవారం ప్రారంభించింది.

విదేశాల్లో లైసెన్స్, ఉద్యోగాలు, శాశ్వత నివాసం కోరుకునే ఆరోగ్య సంరక్షణ నిపుణులకు పర్సనలైజ్డ్​సర్వీసులను అందిస్తామని తెలిపింది. ఇప్పటికే వేలాది మంది ఆరోగ్య నిపుణులు విదేశీ లైసెన్స్ పరీక్షలను రాయడంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, యూకే, యూఎస్ఏ, గల్ఫ్ తదితర దేశాల్లో ఉద్యోగాలను ఇప్పించడంలో సహాయం చేశామని అకడమికల్లీ గ్లోబల్​ పేర్కొంది.