V6 News

మీ సేవ కేంద్రాలపై ఏసీబీ దాడులు 

మీ సేవ కేంద్రాలపై ఏసీబీ దాడులు 

మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు : ​మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు మీసేవ కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని కొంత కాలంగా ఏసీబీ ఆఫీసర్లకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎసీబీ ఆఫీసర్లు నగరంలోని పలు మీ సేవ సెంటర్లపై మెరుపు దాడులు నిర్వహించారు.

కొందరు ఆఫీసర్లు, మీసేవ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు వివరాలు సేకరించినట్లు సమాచారం. క్యాస్ట్, ఇన్​కం, రెసిడెన్స్​ సర్టిఫికెట్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని, అర్హత లేని వారికి కూడా సర్టిఫికెట్లు జారీ చేశారని గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు పలు కీలక డాక్యుమెంట్లను, రికార్డులు, కంప్యూటర్​ హార్డ్​ డిస్కులను ఏసీబీ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.