చంద్రబాబు రిమాండ్ పొడిగింపు : 24వ తేదీ వరకు విధిస్తూ తీర్పు

చంద్రబాబు రిమాండ్ పొడిగింపు : 24వ తేదీ వరకు విధిస్తూ తీర్పు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ ను సెప్టెంబర్ 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకున్నది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును.. వర్చువల్ గా విచారణ చేశారు న్యాయమూర్తి. 2023, సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు.. జైలు అధికారులు చంద్రబాబును.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట హాజరుపరిచారు. 

ఈ సమయంలో చంద్రబాబు మాట్లాడటానికి అవకాశం కల్పించారు జడ్జి. ఈ కేసులో నన్ను అకారణంగా ఇరికించారని.. నా తప్పు లేదని తన వాదన వినిపించుకున్నారు చంద్రబాబు. కేసులో తన ప్రమేయం లేకుండా అరెస్ట్ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు వాదనను విన్న జడ్జి.. విచారణలో అన్ని విషయాలు వెల్లడవుతాయన్నారు. చట్టం, న్యాయం అందరికీ సమానమే అని.. ప్రస్తుతం రిమాండ్ ను 24వ తేదీ వరకు.. అంటే మరో రెండు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు జడ్జి. 

ALSO READ : ఐఫోన్ 15 సిరీస్ సేల్స్ ప్రారంభం.. భారీ క్యూలతో దర్శనమిస్తోన్న స్టోర్లు

అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రిమాండ్ గడువు ముగియటంతో.. ఇవాళ కోర్టు ఎదుట వర్చువల్ గా హాజరుపరిచారు జైలు అధికారులు. రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి.