ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదివారం ( జులై 20 ) ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఈ కేసుకు సంబంధించి శనివారం ( జులై 19 ) విచారణకు హాజరైన మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఇవాళ వైద్య పరీక్షల అనంతరం మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించినట్లు సమాచారం.

లిక్కర్ స్కాం కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని కీలక సూత్రధారిగా భావిస్తున్నారు అధికారులు. మిథున్ రెడ్డి అరెస్ట్ తో లిక్కర్ స్కాం కేసు  కీలక దశకు చేరుకుందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తోంది వైసీపీ. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు. జగన్ కు సన్నిహితుడు కావడం వల్లే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని.. మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటికి వస్తాడని అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

లిక్కర్ స్కాం కేసులో A4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు ఏసీబీ కోర్టు ఆదేశాలతో ఆదివారం ( జులై 20 ) రిమాండ్ కి తరలించారు.. ఈ కేసుకు సంబంధించి శనివారం సిట్ విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డిని 6 గంటల విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో మిథున్ రెడ్డి కీలకమని భావిస్తోంది సిట్. ఇప్పటికే ఓసారి నోటీసులిచ్చి మిథున్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ ఇవాళ రెండోసారి విచారణకు పిలిచి ప్రశ్నించింది. మిథున్ రెడ్డికి సంబంధించి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు గుర్తించిన సిట్ ఆయనను అదుపులోకి తీసుకుంది.