ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల జప్తునకు కోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తుల జప్తునకు కోర్టు గ్రీన్ సిగ్నల్

ఫైబర్ నెట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడుగురు నిందితులకు చెందిన రూ.114 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయాలని సీఐడీని ఆదేశించింది. రూ.114 కోట్లు రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసే ఆదేశాలు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఇటీవల సీఐడీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన ఏసీబీ కోర్టు ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు ఏడు ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. 

మొత్తం ఏడుగురి అస్తులు

  • ఏ7 తుమ్మల ప్రమీల, టేరాసాఫ్ట్ ఎండీ బార్య.
  • ఏ9 తుమ్మల గోపీ చంద్, టేరాసాఫ్ట్ ఎండీ.
  • ఏ11 టెరా సాప్ట్ కంపెనీ.
  • ఏ23 నెట్ టాప్ కంపెనీ ఎండి  కనుమూరి కోటేశ్వరరావు