
హైదరాబాద్: అవినీతి నిరోధకశాఖ నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలనిస్తోంది. విస్తృతంగా ప్రచారం కల్పించడం వల్ల కంప్లయింట్ ఇచ్చేందుకు బాధితులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఒక్క జులై నెలలోనే 22 మందిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. 13 మందిని ట్రాప్ చేయగా.. ఆదాయినికి మించి ఆస్తులున్న ఒకరిని, క్రిమినల్ మిస్ కండక్ట్ చేసిన మరొకరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఒక్క నెలలలో 5 కోట్ల 75 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసులో 11.05 కోట్ల ప్రాపర్టీని గుర్తించినట్టు చెప్పారు. అక్రమా లు, అవినీతికి నిలయాలుగా పేరున్న ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. లెక్క చూపని కోటీ 49 లక్షలను స్వాధనం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 148 కేసులు నమోదయ్యాయని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో 145 మంది ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ ఏడు నెలల వ్యవధిలో రూ.30 కోట్ల 32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నా మన్నారు.
►ALSO READ | కేసీఆర్, కేటీఆర్కు విలువలు లేవు.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిందే బీఆర్ఎస్: కడియం
అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా టోల్ ఫ్రీ నంబర్లు అందరికీ వివరించేందుకు బస్సులు, ప్రధాన కూడళ్లు, సర్కారు కార్యాల యాల వద్ద స్టిక్కర్లు అతికిస్తున్నట్టు చెప్పారు. 'లంచం డిమాండ్ చేశారా..? వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయండి' అనే స్టిక్కర్లను విస్తృతంగా ప్రచారంరలోకి తెచ్చినట్టు చెప్పారు.