ఏసీబీ కస్టడీకి  హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ

ఏసీబీ కస్టడీకి  హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ
  • 8 రోజుల పాటు విచారణ
  • కీలక అంశాలు వెలుగులోకి వచ్చే చాన్స్
  • ఎవరెవరు ఇరుక్కుంటారో..?

హైదరాబాద్:  హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మణికొండ పుప్పాలగూడ సెక్రటేరియట్‌కాలనీ ఆదిత్య పోర్ట్‌వ్యూ విల్లాతోపాటు, ఆయన సన్నిహితులు, బంధువులకు సంబంధించిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో రూ.8.26కోట్లు నగదు దొరికింది. వందకోట్లకు పైగా స్థిరాస్తులు సంపాదించినట్టు ఏసీబీ ప్రాథమికంగా  నిర్ధారించింది.

ఎక్కువ సొమ్మను ఆయన భూములపైనే ఇన్వెస్ట్ చేశారు. దాదాపు వందెకరాలు ఉండొచ్చని.. అవన్నీ హైదరాబాద్‌ శివార్లతోపాటు కొడకండ్ల, కల్వకుర్తి, యాదాద్రి, జనగామల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ డైరెక్టర్ గా ఉన్న సమయంలో పర్మిషన్ల కోసం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఆయన వెనక ఎవరున్నారు..? ఎవరెవరికి పర్సంటేజీలు దక్కాయి. ఈ అవినీతి డొంక ఎక్కడి దాకా ఉందనే విషయాలను బాలకృష్ణ విచారణలో తేలనుంది. దీంతో అక్రమార్కుల్లో టెన్షన్ నెలకొంది.