లక్షన్నర లంచం డిమాండ్.. ఇన్​స్పెక్టర్ అరెస్ట్

లక్షన్నర లంచం డిమాండ్.. ఇన్​స్పెక్టర్ అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు: ఓ కేసులో నిందితుడిని తప్పించేందుకు రూ.లక్షన్నర లంచం డిమాండ్​చేసిన షాయినాయత్​గంజ్​మాజీ ఇన్​స్పెక్టర్​బాలు చౌహాన్​ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్​చేశారు. గత నెల 7న(డిసెంబర్) షాయినాయత్​గంజ్ పీఎస్​లో నమోదైన కేసులో ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు ఇన్​స్పెక్టర్ బాలు చౌహాన్ రూ.1.5 లక్షలు డిమాండ్ చేశాడు. సదరు వ్యక్తి రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. తర్వాత లంచం డిమాండ్​చేసిన విషయాన్ని ఆధారాలతో సహా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. 

విషయం తెలుసుకున్న బాలు చౌహాన్ లాంగ్ లీవ్ పెట్టి వెళ్లాడు. ఈ నెల 3న హైదరాబాద్ సీపీ ఇన్​స్పెక్టర్​బాలుచౌహాన్​ను షాయినాయత్​గంజ్​పీఎస్​నుంచి బదిలీ చేశాడు. శుక్రవారం సిటీకి వచ్చిన అతన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఏసీబీ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరిచి, రిమాండ్ కు తరలించారు.