
కర్నాటకలో రియల్ ఛేజింగ్ సీన్ జరిగింది. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకునేందుకు తుముకూర్ ఎస్ఐ సోమశేఖర్ పరుగెత్తాడు. అయితే కిలో మీటర్ వెంబడించి పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ కేసులో చంద్రన్న అనే వ్యక్తి వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. వాహనాన్ని ఇవ్వడానికి 28 వేల లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ సోమశేఖర్. పైసలు వసూలు చేసే పనిని ఓ కానిస్టేబుల్ కు అప్పగించాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని చంద్రన్న ఏసీబీని ఆశ్రయించాడు.
అవినీతి ఎస్సై సోమశేఖర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు ప్లాన్ వేశారు. లంచం తీసుకున్న కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులను చూసి సోమశేఖర్ రోడ్డుపై పరుగెత్తాడు. వెంటనే అలర్ట్ అయిన ఏసీబీ అధికారులు కిలో మీటర్ పరిగెత్తి అతన్ని పట్టుకున్నారు.