గోవర్ధన్ పూజలో కొరడా దెబ్బలు తిన్న సీఎం

గోవర్ధన్ పూజలో కొరడా దెబ్బలు తిన్న సీఎం

ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‎ను కొరడా దెబ్బలు కొట్టారు. అదేంటి ఓ సీఎంను కొరడా దెబ్బలు కొట్టడం ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అసలు విషయం ఏంటో చూద్దాం. ఛత్తీస్‌గఢ్ ప్రతి ఏటా గోవర్ధన్ పూజ ఆడంబరంగా నిర్వహిస్తారు. ఈ పూజలో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. అందులో భాగంగా మనుషులను కొరడాతో దెబ్బలు కొడుతుంటారు. ఇలా కొరడా దెబ్బలు తింటే అడ్డంకులన్నీ తొలగిపోతాయని ఆ రాష్ట్ర ప్రజల నమ్మకం. ఈ ఆచారాన్ని రాష్ట్రంలోని చాలామంది అనుసరిస్తుంటారు. ఈ పద్ధతిలోనే సీఎం భూపేష్ బఘేల్ కూడా కొరడా దెబ్బలు తిన్నారు. శుక్రవారం ఉదయం జంజిగిరి గ్రామంలో ఆయన ఈ ఆచారాన్ని అనుసరించారు. గ్రామానికి చెందిన బీరేంద్ర ఠాకూర్ కొరడాతో సీఎంను కొట్టారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమని సీఎం తెలిపారు. ఇలా చేయడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోయి.. సకల శుభాలు కలుగుతాయని ఆయన చెప్పారు. గోవు ఎంత సుభిక్షంగా ఉంటే ప్రజలు అంత అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో గోవర్ధన్ పూజకు ఎక్కువ ఆదరణ ఉంటుందని సీఎం చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను, ఉల్లాసంగా ఉన్న వారి ముఖాలు చూస్తుంటే మన రాష్ట్రం సాంస్కృతికంగా ఎంత గొప్పగా ఉందో తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ సాంస్కృతిక సంపదను వారసత్వ సంపదగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి కర్తవ్యమన్నారు.

For More News..

రాకెట్లతో మంటలంటుకొని 4 వేల పుస్తకాల దగ్ధం

చిన్నారి లేఖతో ఆర్టీసీ కదిలొచ్చింది.. గ్రామానికి బస్సొచ్చింది