గజ్వేల్​ ఈఎన్సీ హరిరాం సస్పెన్షన్

 గజ్వేల్​ ఈఎన్సీ హరిరాం సస్పెన్షన్
  • కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ అధికారుల పిటిషన్

హైదరాబాద్, వెలుగు: గజ్వేల్ ఈఎన్సీ బి.హరిరాంను ప్రభుత్వం సస్పెండ్​ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా పనిచేసిన ఆయనను అక్రమాస్తుల కేసులో శనివారం అర్ధరాత్రి ఏసీబీ అరెస్ట్​ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ రెయిడ్స్​లో ఆయన  ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారని తేలింది. రూ.300 కోట్లకు పైగా విలువైన వ్యవసాయ భూములు, ఫాంహౌస్, కార్లు, ప్లాట్లు, ఫ్లాట్లు ఉన్నట్టు తేలడంతో ఏసీబీ అతన్ని అరెస్ట్​ చేసింది. 

ఈ నేపథ్యంలోనే బుధవారం హరిరాంను సస్పెండ్​ చేస్తున్నట్టు ఇరిగేషన్  శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన సస్పెన్షన్​తో ఖాళీ అయిన స్థానంలో సీఈ పీవీఏ ప్రసాద్​ను నియమించారు. ఆయనకు గజ్వేల్ఈఎన్సీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం చంచల్‌‌‌‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈఎన్సీ హరిరాంను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ  కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడంతో బినామీ ఆస్తులను గుర్తించేందుకు 5 రోజులు కస్టడీకి అడిగారు. ఆ కస్టడీ పిటిషన్‌‌‌‌పై కోర్టులో విచారణ జరుగుతోంది.