
పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. కల్యాణలక్ష్మి మంజూరు కోసం మండలానికి చెందిన ఒక వ్యక్తి నుంచి ఆర్ఐ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో బాధితుడు రూ.4 వేలు ఇవ్వగా, ఆర్ఐను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్ ఆఫీస్‌లో విచారణ చేస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.