మ్యాప్ సరిచేసేందుకు రూ. 25 వేలు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన మహబూబ్ నగర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి

మ్యాప్ సరిచేసేందుకు రూ. 25 వేలు డిమాండ్..  ఏసీబీకి చిక్కిన మహబూబ్ నగర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి
  • రూ.15 వేలు లచం తీసుకుంటూ పట్టుబడ్డ వెంకటేశ్వర్ రెడ్డి

మహబూబ్ నగర్, అర్బన్, వెలుగు : ల్యాండ్  మ్యాప్ ను సరి చేసేందుకు ఓ రైతు నుంచి లంచం తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. భూత్పూర్ మండలం కరివేణ గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలానికి సంబంధించిన వివరాలు సరిగా లేకపోవడంతో, మ్యాప్ సరి చేసి ఇవ్వాలని సర్వే డిపార్ట్ మెంట్ కు అప్లై చేసుకున్నాడు. ఈ పని పూర్తి చేసేందుకు సూపరిటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి రూ. 25 వేలు డిమాండ్ చేసి... గతంలోనే రూ. 10 వేలు తీసుకున్నాడు.

 మిగిలిన రూ. 15 వేల కోసం ఒత్తిడి తేవడంతో సదరు రైతు ఏసీబీ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారి సూచనతో బుధవారం సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డిని కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.