ఏసీసీ లాభం 3 వందల 88 కోట్లు

ఏసీసీ లాభం 3  వందల 88 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్​లోని సిమెంట్​ కంపెనీ  ఏసీసీ లిమిటెడ్​ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. సెప్టెంబర్​ 2023 క్వార్టర్లో ఏసీసీ లిమిటెడ్​ రూ. 388 కోట్ల లాభం సంపాదించింది. అమ్మకాలు పెరగడం, కిల్న్​ ఫ్యూయెల్​ రేట్లు తగ్గుముఖం పట్టడం, ప్రీమియం ప్రొడక్టులకు గిరాకీ పెరగడం వంటి కారణాలతో లాభాల బాటలోకి ఏసీసీ వచ్చింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో కంపెనీ రూ. 87 కోట్ల నష్టం పొందింది. 

సెప్టెంబర్​2023 క్వార్టర్లో రెవెన్యూ 11.22 శాతం పెరిగి రూ. 4,434.73 కోట్లకు పెరిగినట్లు కంపెనీ బీఎస్​ఈ ఫైలింగ్​లో తెలిపింది. సిమెంట్​, క్లింకర్​ సేల్స్​ వాల్యూమ్​ 17.4 శాతం గ్రోత్​తో 8.1 మిలియన్​ టన్నులకు చేరినట్లు పేర్కొంది.  తాజా క్వార్టర్లో కిల్న్​ ఫ్యూయెల్​ ఖర్చు 42 శాతం తగ్గినట్లు ఏసీసీ లిమిటెడ్​ వెల్లడించింది. 

డిమాండ్​ మెరుగ్గానే ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో సిమెంట్​ ఇండస్ట్రీ పనితీరు ఆశాజనకంగానే ఉంటుందని ఏసీసీ హోల్​టైమ్​ డైరెక్టర్​ అజయ్​ కపూర్​ చెప్పారు. గురువారం ట్రేడింగ్​లో ఏసీసీ షేర్లు 0.92 శాతం పెరిగి రూ. 1,907.80 వద్ద క్లోజయ్యాయి.