యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగుల తొలగింపు

ఐటీ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సేవలు అందించే దిగ్గజ కంపెనీ యాక్సెంచర్.. బిగ్ షాక్ ఇచ్చింది. రాబోయే ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 2.5 శాతంగా ఉందని వెల్లడించింది. మార్చి 23వ తేదీ గురువారం.. ఈ మేరకు కంపెనీ ప్రకటన చేయటం.. ఐటీ రంగంలో సంచలనంగా మారింది. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిగజారుతుందని.. కార్పొరేట్ ఆదాయం, లాభాలు తగ్గిపోతున్నాయని.. ఈ క్రమంలోనే యాక్సెంచర్ కంపెనీ.. ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఆదాయం అంచనా ఒకటి నుంచి రెండు శాతం తగ్గనున్నట్లు స్పష్టం చేస్తూ.. ఆ మేరకు ఖర్చులు తగ్గించుకునేందుకు.. కంపెనీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని 19 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది కంపెనీ.