తిరుమల ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. చెట్టును ఢీకొని నుజ్జు నుజ్జయిన కారు..

తిరుమల ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. చెట్టును ఢీకొని నుజ్జు నుజ్జయిన కారు..

తిరుమల ఘాట్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు నుజ్జు నుజ్జయ్యింది. శుక్రవారం ( మే 2 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుమల మొదటి ఘాట్ రోడ్డుపై కర్ణాటకకు చెందిన కారు మితిమీరిన వేగంతో వచ్చి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది. అయితే.. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. 

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణనష్టమేమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన సమాచారం అందుకున్న విజిలెన్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.