
తిరుమల కొండపై యాక్సిడెంట్.. తిరుమల కొండ పైనుంచి తిరుపతి వస్తున్న కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొన్నది. 2025, ఆగస్ట్ 22వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులోని 26వ మలుపు దగ్గర.. ముందు వెళుతున్న ఆర్టీసీ బస్సును.. వెనక నుంచి ఢీకొన్నది కారు. బ్రేక్ ఫెయిల్ కావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నాడు డ్రైవర్.
కొండ పైనుంచి దిగుతుండటం.. కారు బ్రేకులు ఫెయిల్ కావటంతో వేగంగా వచ్చి.. ఆర్టీసీ బస్సు వెనక ఢీకొట్టాడు డ్రైవర్. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావటంతో.. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముందు ఆర్టీసీ బస్సు లేకుండా ఉండి ఉంటే.. భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.
ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే.. తిరుమల పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. గాయపడిన వాళ్లను అంబులెన్స్ లో తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ లో మొదటి ఘాట్ రోడ్డులో కొద్ది సమయం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తిరుమల పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది కారు, బస్సును పక్కకు తప్పించి.. ట్రాఫిక్ క్లియర్ చేశారు.