గొల్లపల్లి యూనియన్ బ్యాంకు ఎదుట ఖాతాదారుల ధర్నా

గొల్లపల్లి యూనియన్ బ్యాంకు ఎదుట ఖాతాదారుల ధర్నా

జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా గొల్లపల్లి యూనియన్ బ్యాంకు ఎదుట ఇబ్రహీంనగర్ కు చెందిన ఖాతాదారులు ధర్నాకు దిగారు. తమకు తెలియకుండా తమ ఖాతాల్లో నుండి డబ్బులు తీసుకున్న బిజినెస్ కరస్పాండెంట్ బొమ్మ అంజయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగారు. తమ డబ్బులను బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు, యూనియన్ బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో నుంచి సుమారు రూ. 2 కోట్లు తీసుకుని బొమ్మ అంజయ్య పారిపోయాడని బాధితులు గొల్లపల్లి యూనియన్ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు.

బాధితుల నిరసనతో బ్యాంకు మేనేజర్ స్పందించారు. బిజినెస్ కరస్పాండెంట్ బొమ్మ అంజయ్యపై కేసు పెట్టామని, ఖాతాదారుల డబ్బులను అకౌంట్లలో జమ చేస్తామని బ్యాంకు మేనేజర్ హామీ ఇవ్వడంతో బాధితులు ధర్నా విరమించారు. యూనియన్ బ్యాంకు బాధితులు దాదాపు 120 మంది వరకు ఉన్నట్లు సమాచారం.