హిట్ అండ్ రన్ కేసులో నిందితుల అరెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో నిందితుల అరెస్ట్

జూబ్లీహిల్స్​,వెలుగు:  జాబ్ వచ్చినందుకు ఫ్రెండ్స్​కు పార్టీ ఇచ్చి వెళ్తూ.. కారుతో ఓ యువకుడిని ఢీకొట్టిన హిట్​అండ్​రన్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్​చేశారు.  జూబ్లీహిల్స్​ఏసీపీ కె.హరిప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. సికింద్రాబాద్​ఏరియా తుకారాంగేట్​కు చెందిన కొవ్వూరి రుత్విక్​రెడ్డి(21)కి ఇటీవల అమెజాన్​సంస్థలో​జాబ్ వచ్చింది. తన ఫ్రెండ్స్ అయిన విద్యార్థి వైష్ణవి (23), లాలాపేటకు చెందిన పోల్సాని లోకేశ్వరరావు(21) మౌలాలికి చెందిన విద్యార్థి బుల్లా అభిలాష్​(20) వెస్ట్​మారేడ్​పల్లికి చెందిన ప్రయివేట్​ఉద్యోగి మెగదామ్​పల్లె అనికేత్​(22) కు పార్టీ ఇచ్చేందుకు ప్లాన్ చేశాడు.

 రిత్విక్ రెడ్డి తన బావ నాగచరణ్​రెడ్డి వెర్నా కారును (టీఎస్​08​ ఎఫ్​ఎన్​6663) తీసుకుని మంగళవారం సాయంత్రం ఫ్రెండ్స్ తో  బయలు దేరాడు. మార్గం మధ్యలో తుకారాంగేట్​వద్ద కల్యాణి బార్​లో నాలుగు బీర్లు తీసుకుని వాటిని తాగుతూ గచ్చిబౌలి, దుర్గం చెరువు, అమెజాన్​ కంపెనీ ఏరియా తదితర  ప్రాంతాల్లో తిరిగారు. బుధవారం తెల్లవారుజాము 4 గంటలకు మాదాపూర్​వివేకానందనగర్ లో 4 ఏఎంలో హోటల్ లో బిర్యానీ తిన్నారు. తాగిన మత్తులో రిత్విక్ రెడ్డి కారును స్పీడ్ గా నడిపి ముందుగా వెళ్తున్న బైక్ ను ఢీకొట్టగా.. దానిపై నుంచి తారక్​రామ్, రాజు గాలిలో పల్టీలు కొట్టి కిందపడిపోగా ఒకరు చనిపోయారు. అయితే.. కారు ఆపకుండా తుకారాం గేటుకు వెళ్లిపోయారు.

 యాక్సిడెంట్ పై  రిత్విక్ రెడ్డి తన ఫ్రెండ్ గుడిమెట్ల​సురేశ్ రెడ్డికి తెలిపాడు. మరో కారులో ఫ్రెండ్స్ ను ఇళ్లకు పంపించారు. సురేష్​రెడ్డి ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాడు. అక్కడి ఏమి జరుగుతుందో చూసి వెళ్లిపోయాడు. సమాచారం మేరకు  నిందితులు మైత్రీవనం, ఏస్సార్​నగర్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డీఐ వీరశేఖర్​అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. తాగి కారు నడిపి యాక్సిడెంట్​చేసిన రుత్విక్​రెడ్డిని (ఏ1)గా  ఫ్రెండ్స్ పైనా కేసులు నమోదు చేసి  గురువారం అరెస్ట్  చేసినట్లు చెప్పారు.