
నిర్మల్, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలుశిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ నిర్మల్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శ్రీవాణి మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ జానకి షర్మిల తెలిపిన వివరాల మేరకు.. కడెం మండలం నచ్చనెల్లాపూర్ గ్రామానికి చెందిన జాడి నారాయణ 2020 సంవత్సరంలో ఐదేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
వాదోపవాదాల అనంతరం సాక్షులను విచారించి నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా వ్యవహరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె .వినోద్ రావు, అప్పటి డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్ఐ ప్రేమ్ దీప్, డ్యూటీ ఆఫీసర్ డల్లు సింగ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.