పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు

పోక్సో కేసులో  నిందితుడికి ఏడేళ్ల జైలు

సిద్దిపేట రూరల్, వెలుగు:  పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ సిద్దిసేట ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్‌ అండ్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చినట్లు సిద్దిపేట ఏపీసీ దేవారెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణ పరిధిలోని గాడిచర్లపల్లికి చెందిన అక్కరాజుల మల్లయ్య (70) 2018 సెప్టెంబర్‌‌17న తన ఇంటి పక్కన ఉండే ఏడేళ్ల పాపను ఇంట్లోకి  తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.  

చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అప్పటి వన్ టౌన్ సీఐ నందీశ్వర్ రెడ్డి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆధారాలు సమర్పించగా విచారణ జరిపిన కోర్టు మంగళవారం నిందితుడికి జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు, వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌, కోర్టు విధులు నిర్వహించే  సిబ్బందిని సీపీ శ్వేత అభినందించారు.