రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు మృతి.. శ్రీలంకకు డెడ్ బాడీ

రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు మృతి.. శ్రీలంకకు డెడ్ బాడీ

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా ఉన్న సంతాన్ చెన్నై ఆస్పత్రిలో మృతి చెందారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న సంతాన్ చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ మరణించాడని హాస్పిటల్ డీన్ ఇ థెరానీరాజన్ తెలిపారు. అతని బాడీకి పోస్ట్ మార్ట్ం చేస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని శ్రీలంకకు పంపడానికి చట్టపరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. 

 సంతాన్1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన కేసులో 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2022లో సుప్రీంకోర్టు అతడిని విడుదల చేసింది. సంతన్ శ్రీలంకకు చెందిన వ్యక్తి. విడుదలైన తర్వాత సంతాన్ అదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు కలిసి తిరుచ్చిలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం కాలేయ వ్యాధితో మరణించాడు.