కోడికత్తి శ్రీను జైలునుంచి బయటికొచ్చాడు

కోడికత్తి శ్రీను జైలునుంచి బయటికొచ్చాడు

విశాఖ: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో బెయిల్ లభించడంతో నిందితుడు జనంపల్లి శ్రీనివాస్ కు శుక్రవారం(ఫిబ్రవరి 9) విడుదలయ్యాడు. కోడి కత్తి శ్రీను అలియాస్ జనంపల్లి శ్రీనివాస్ కు గురువారం (ఫిబ్రవరి 8) షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.

ALSO READ: మార్చి 1 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

ఐదేళ్లుగా విశాఖ సెంట్రల్ జైలులోనే ఉన్నాడు శ్రీనివాస్. తనకు న్యాయం చేయాలని శిక్షకాలంలో శ్రీనివాస్ జైలులోనే దీక్ష చేసినట్లు  ప్రచారం సాగుతోంది. శ్రీనివాస్ కు మద్దతుగా అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు కూడా ఇటీవల దీక్ష చేశారు. కోడికత్తి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ కొన్ని నెలల క్రితం తనకు జైలు విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేఖ రాశాడు.