
అచ్చంపేట, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరారు. శనివారం రాత్రి అమరావతిలోని సెక్రటేరియట్ కు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ వెళ్లి సీఎం చంద్రబాబును కలిశారు. మాచర్ల – -అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలోని కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి సహరించాలని, శ్రీశైలం దేవస్థాన పాలకమండలిలో అచ్చంపేట సెగ్మెంట్ నుంచి సభ్యులను నియమించాలని కోరుతూ.. చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.
త్వరలోనే ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల మధ్య వంతెన నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. అచ్చంపేట నుంచి శ్రీశైలం దేవస్థానం పాలకమండలిలో సభ్యులను నియమించుకోవాలని దేవాదాయశాఖ అధికారులకు, శ్రీశైలం ఎమ్మెల్యేను ఆదేశించారని
ఆయన చెప్పారు.