
స్టార్ హీరోగానే కాక నిర్మాతగానూ మెప్పిస్తు న్నాడు రామ్ చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో నటిస్తూనే తన తండ్రి హీరోగా ‘ఆచార్య’ నిర్మిస్తు న్నాడు. ఈ సినిమాలో చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. కానీ కరోనాతో సినిమా షెడ్యూల్స్ అన్నీ మారడంతో చరణ్ నటిస్తాడా లేదా అనే సందేహాలున్నాయి. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. గతంలో ‘మగధీర’లో కాసేపు స్టెప్పులేసిన చిరంజీవి, చరణ్ హీరోగా తెరకెక్కిన ‘బ్రూస్‌లీ’లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ‘ఖైదీ నంబర్ 150’లో చరణ్ కాసేపు తండ్రితో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే ఇలా గెస్ట్ అప్పియరెన్సులు మాత్రమే కాకుండా పూర్తి స్థాయిలో కలిసి కనిపించాలనేది చిరంజీవి వైఫ్ సురేఖ కోరికట
. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన చరణ్.. ‘ఆచార్య’ సినిమాతో అమ్మ కోరిక నెరవేరుతుందని అన్నాడు. దీంతో చరణ్ ఈ సినిమాలో నటించడం కన్ఫర్మ్ అయినట్టేనని అర్థమవుతోంది. ఇక ‘ఆర్‌ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయ్యాక ‘ఆచార్య’లో నటించాలనుకున్న చరణ్… కరోనా మార్పులతో ముందుగా ‘ఆచార్య’ షెడ్యూల్ కంప్లీట్ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు స్పోర్ట్స్ డ్రామాలో నటించడం తన డ్రీమ్ అని కూడా చెప్పాడు చరణ్. గతంలో ‘మెరుపు’ అనే సినిమా స్టార్ట్ చేసినా అది ఆగిపోయింది. అలాంటి స్పోర్ట్స్ సబ్జెక్ట్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నాడట చరణ్. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఇక చరణ్ కోరిక నెరవేరడమే మిగిలింది.