'ఆచార్య'తో 'సిద్ధ'.. అదిరిపోయిన చిరు, చరణ్ పోస్టర్

V6 Velugu Posted on Mar 27, 2021

హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ శనివారంతో 36వ పడిలోకి అడుగు పెడుతున్నాడు. దీంతో ఆయన నటిస్తున్న సినిమాల్లోని ఫస్ట్ లుక్‌లు, టీజర్లను మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన ఆర్ఆర్ఆర్‌‌లో నుంచి అల్లూరి సీతారామరాజుగా చరణ్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. 

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరుతో కలసి చరణ్ నటిస్తున్న ఆచార్యలోని తండ్రీతనయుల ఫొటోను ఫిల్మ్ యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌‌లో నక్సలైట్ పాత్రలో చిరు, చరణ్ ఇంటెన్సివ్‌‌గా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఈ మూవీలో చరణ్ పాత్ర పేరు సిద్ధ కావడంతో కామ్రేడ్ సిద్ధకు హ్యాపీ బర్త్ డే అంటూ కొణిదెల ప్రో కంపెనీ వీరి లుక్ పోస్టర్‌ను ట్వీట్ చేసింది. ఇందులో చిరుకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఆచార్య సినిమాను మే 13న భారీ స్థాయిలో ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

Tagged ram charan, acharya, happy birthday, Chiranjeevi, First look

Latest Videos

Subscribe Now

More News