మాస్ ఫీస్ట్ రెడీ

మాస్ ఫీస్ట్ రెడీ

‘ఆర్ఆర్ఆర్’ హడావుడి తర్వాత.. తెలుగు ప్రేక్షకుల చూపులన్నీ ‘ఆచార్య’ వైపు మళ్లాయి. చిరంజీవి, రామ్ చరణ్‌‌‌‌ హీరోలుగా కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మాస్‌‌‌‌ కమర్షియల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. ఈ సినిమాను చరణ్‌‌‌‌తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మించారు. చిరంజీవికి జంటగా కాజల్, చరణ్‌‌‌‌కి జంటగా పూజాహెగ్డే నటించారు. రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్‌‌‌‌పై ఫోకస్ పెట్టింది ‘ఆచార్య’ టీమ్. అతి త్వరలో ట్రైలర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేయబోతున్నాం ‘మాస్‌‌‌‌ ఫీస్ట్‌‌‌‌కి రెడీగా ఉండండి’ అంటూ ఉగాది విషెస్ చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఇతర భాషల్లోనూ డబ్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాంటి ఆలోచనలేమీ లేవని, తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అయితే సాధ్యమైనంత ఎక్కువ థియేటర్స్‌‌‌‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓవర్సిస్‌‌‌‌లోనూ రికార్డు స్థాయి స్క్రీన్స్‌‌‌‌లో విడుదల కానుంది. దేవాదాయ శాఖ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో  కథను మలుపుతిప్పే కీలకపాత్రలో అనసూయ కనిపించనుందట. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.