హ్యాపీ బర్త్ డే చెర్రీ.. ఆచార్య నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

హ్యాపీ బర్త్ డే చెర్రీ.. ఆచార్య నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి మగధీరతో రికార్డుల్ని తిరగరాశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తాజాగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి పాత్రలో అదరగొట్టాడు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు చెర్రీకి విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆచార్య టీం రామ్ చరణ్కు స్పెషల్ విషెస్ చెప్పింది. ఆచార్య సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో చరణ్ సరికొత్త లుక్లో అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు. వేణువుపై ఏదో రాస్తున్నట్లు ఉన్న పోస్టర్ అభిమానుల్ని ఎంతో ఆకట్టుకుంటోంది. 

చిరంజీవి లీడ్ రోల్ పోషించిన ఆచార్యలో రామ్ చరణ్ సైతం కీలక పాత్ర పోషించారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్, టీజర్, పాటలతో భారీ అంచనాలు పెంచిన ఆచార్య మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది.