
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుపై ఆరోపణలు నిరూపిస్తే తాను పీకకోసుకుంటానని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. చంద్రబాబు కు కానీ తనకు కానీ..తమ కుటుంబాలకు కానీ పైసా లబ్ది చేకూరినట్టు నిరూపించినా తాను పీక కోసుకుంటానని సవాల్ చేశారు. అంతేకాకుండా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఇరికించి.. దారుణంగా వేధిస్తున్నారని అన్నారు. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం సీఐడీ అధికారులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారన్నారు. చంద్రబాబు ఉగ్రవాది కాదని, పారిపోలేదని, ఎక్కడో దాక్కొని తప్పించుకున్న వ్యక్తి కాదన్నారు.
ఏపీలో రాజకీయ కాక్ష తప్ప.. చట్టం,ధర్మం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీలో పిచ్చి పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పారు.
రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష పార్టీలను జగన్ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. విపక్ష నేతలను జైలులో పెట్టి సీఎం జగన్ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌లో 409 సెక్షన్ ఎందుకు పెట్టారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా లాభం జరిగే ఆ సెక్షన్ పెడతారని అన్నారు. సీఐడీ అధికారులకు సిగ్గులేదని.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ నాటకం ఆడమంటే ఆ నాటకం ఆడుతున్నారని విమర్శించారు.