గీతంలో ఘనంగా అచీవర్స్ డే

గీతంలో ఘనంగా అచీవర్స్ డే
  •     180 మల్టీనేషనల్​ కంపెనీల క్యాంపస్​ సెలక్షన్స్​
  •     సెలెక్ట్​ అయిన వారికి నియామక పత్రాలు అందజేత 

రామచంద్రాపురం,వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో శుక్రవారం అచీవర్స్​డే ఘనంగా నిర్వహించారు.  క్యాంపస్​ నియామకాల్లో ఎంపికైన ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మా, హ్యుమనిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ స్టూడెంట్స్​కు నియామక పత్రాలతో పాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశ పత్రాలను అందించారు. 

2023,--24 విద్యా సంవత్సరంలో దాదాపు 180 దేశీయ, బహుళ జాతి కంపెనీలు గీతంలో క్యాంపస్​సెలక్షన్స్​నిర్వహించగా 150 కంపెనీలు బీటెక్, ఎంటెక్, బిబీఏ, బీకాం, ఎంబీఏ, బి.ఫార్మా, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీఏ స్టూడెంట్స్​ను ఎంపిక చేసినట్టు గీతం వర్గాలు ప్రకటించాయి. కొంతమంది స్టూడెంట్స్​ఉన్నత విద్యాభ్యాసం కోసం అప్లై చేసుకుని విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశార్హత సాధించినట్టు తెలిపారు. 

ఎక్కువ మంది స్టూడెంట్స్​ఐటీ సేవలతో పాటు బహుళజాతి కంపెనీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో జాబ్స్​పొందినట్టు చెప్పారు. టెక్నాలజీ  స్టూడెంట్స్​కు రూ.15 లక్షల గరిష్ట వార్షిక వేతనం, మేనేజ్మెంట్ స్టూడెంట్స్​కు రూ.14.13 లక్షలు, సెర్చ్ స్టూడెంట్స్​కు రూ.7.5 లక్షల చొప్పున వార్షిక వేతనాలకు ఎంపి కెనట్టు తెలిపారు.  కార్యక్రమంలో  వివిధ కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీవివిధ విభాగాధిపతులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.