20 కేజీల గంజాయి పట్టివేత: ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ

20 కేజీల గంజాయి పట్టివేత:  ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ

హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం 20 కేజీల గంజాయి పట్టుకున్నట్లు ఏసీపీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒడిశాకు చెందిన అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనుగుల, సుభాష్​ సీసా ఐదారేండ్లుగా అక్కడే గంజాయి పండిస్తూ ఇక్కడి దళారులకు అందించేవారు. స్వయంగా తామే అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో ఒడిశా నుంచి విశాఖపట్టణం మీదుగా వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకున్నారు.

అక్కడి నుంచి బస్సులో హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. పక్కా సమాచారంతో సీఐ తిరుమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ యూనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ సిబ్బందితో కలిసి బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. గంజాయిని పట్టుకున్న సీఐ, ఎస్సైతోపాటు పోలీస్ బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.